బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మథురాపూర్కి చెందిన దళిత మహిళ కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానిక శుభ్‌కాంత్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడున్న నకిలీ వైద్యులు ఆమెకు రెండున్నర గంటలు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్‌కు రూ.20 వేలు వసూలు చేశారు. తర్వాత మరో ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు. అక్కడి వైద్యులు ఆమె రెండు కిడ్నీలు చోరీ అయ్యాయని గుర్తించారు. ప్రస్తుతం ఆమె 8నెలలుగా ICUలో చికిత్స పొందుతోంది.