స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవమైన మే 28న కేంద్ర ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది. ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం దీని బరువు 34.65-35.35 గ్రాములు. నాణేనికి ఒక వైపు అశోకుడి స్థూపంతో పాటు దేవనాగరి లిపిలో భారత్, ఆంగ్లభాషలో ఇండియా అని ఉంటాయి. రెండో వైపు పార్లమెంటు కొత్త భవనాన్ని ముద్రించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa