ఓ వ్యక్తి తమకు ఆడపిల్ల పుట్టిందనే ఆనందంతో ఏనుగుపై ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జరిగింది. పచ్‌గావ్‌లో నివసించే గిరీశ్ పాటిల్‌కు అయిదు నెలల క్రితం కూతురు పుట్టింది. ఆ చిన్నారిని శనివారం తన ఇంటికి తీసుకురాగా, గిరీశ్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికాడు. ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. తమ వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని గిరీశ్ ఆనందం వ్యక్తం చేశాడు.