ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి తమిళ మహిళగా విరుదునగర్‌కు చెందిన ముత్తమిళ్ సెల్వి నిలిచారు. జోగిలపట్టికి చెందిన ముత్తమిళ్ సెల్వి ప్రైవేటు టీచర్ గా పనిచేస్తున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని శిక్షణ తీసుకొని ప్రభుత్వాన్ని సాయం కోరగా సీఎం రూ. 15 లక్షలు, మంత్రి ఉదయనిధి రూ. 10 లక్షలు ఇచ్చారు. ఏప్రిల్ 5న ఎవరెస్టు అధిరోహించడం ప్రారంభించిన సెల్వి, 51 రోజుల అనంతరం మే 23న శిఖరంపైకి చేరుకున్నారు.