Bhakthi | Suryaa Desk | Published :
Sun, May 28, 2023, 09:49 AM
భద్రాచలం రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైంది ప్రధాన విభాగాల పనితీరును తనిఖీ చేసేందుకు ఈవో రమాదేవి ఇటీవల దేవస్థానం సిబ్బందితో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు అందించిన నివేదికల ఆధారంగా సరకుల నిల్వ విభాగంలో లెక్కలు సక్రమంగా లేవని తేల్చారు. గడిచిన రెండేళ్లలో ఇద్దరు గుమస్తాల హయాంలో రూ. లక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీనిపై ముందుగా మెమోలను ఇచ్చి వివరణ కోరాలని భావిస్తున్నారు. వారిచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఇద్దరు సెక్యూరిటీ గార్డులను సమాచారం లేకుండా నియమించిన అంశంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపైనా విచారణ సాగుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com