తాడేపల్లి పరిధి సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదిలో ఈతకు వెళ్లి డోలాస్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన డేరాంగులు శివశంకర్, డేరాంగులు కృష్ణయ్య లు ప్రమాదవశాత్తు మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆర్కే చింతిస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ మేరకు శనివారం ఇద్దరు మృతుల కుటుంబాలకు కలిపి రూ. 50వేలు ఆర్థిక సహాయాన్ని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా అందజేయించారు. కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, ఈదులమూడి డేవిడ్ రాజ్ స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.