తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో శనివారం జరిగిన ఎక్సైజ్ వాహనాల వేలంలో ప్రభుత్వానికి రూ. 1. 60 లక్షల ఆదాయం వచ్చిందని సెబ్ సీఐ మల్లిక తెలిపారు. ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వివిధ వాహనాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటల్లో మొత్తం 31 వాహనాలను వేలంలో పాటదారులు దక్కించుకున్నారు. వాహనాలను దగ్గించుకున్న వారు జీఎస్టీతో సహా రూ. 1. 60 లక్షలు చెల్లించారు.