నరసరావుపేట జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు వనరులు, పరి శ్రమల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కొండా సంజీవరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి రెండు నెలల పాటు జిల్లాలోని పలు ప్రదేశాల్లోని స్కిల్ హబ్ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. వినుకొండ ఎస్ జి కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ బ్యుటీషియన్ కోర్సుకు 30 మందికి శిక్షణ ఇవ్వబుడుతుందని, పి. శ్రీకాంత్, 94921 58153నంబరును సంప్రదించాలని కోరారు.