బిజెపి యువ నాయకులు, అడ గ్రామ పంచాయతీ సర్పంచ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు వారి భూములు తిరిగి ఇవ్వాలని శనివారం బీజేపీ చేపట్టిన నిరసనలో పాయల్ శరత్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు ఆయన్ని రిమాండ్ కు తరలించారు. ముందుగా రిమ్స్ లో పాయలు శరత్ కు వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా ఆదేశాల మేరకు రిమాండ్ తరలించారు. విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు పాయలల్ కర్ తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రిమ్స్ కు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.