మధ్యప్రదేశ్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. అయితే ఉజ్జయినిలోని మహాకాల్ లోక్‌లో 830 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్ట్‌లోని సప్తఋషి యొక్క 6 విగ్రహాలు గాలి వాన కారణంగా విరిగిపోయాయి. వీటిని గతేడాది అక్టోబర్‌లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. 10 నుంచి 25 అడుగుల ఎత్తులో ఉండే ఈ సప్తఋషి విగ్రహాలు ఎర్ర రాయి, ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడ్డాయి.