పోలీసు అధికారిపై మహిళ దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అహ్మదాబాద్ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై ఓ మహిళా అభిమాని చేయి చేసుకుంది. మహిళ నెట్టివేయడంతో కిందపడిన ఆ అధికారి సదరు మహిళను ఏం అనకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయినా ఆ మహిళ పోలీసుపై మరోసారి విరుచుకుపడింది. అయితే, ఈ దాడి ఎందుకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.