మూడేళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో జరిగింది. చకేరి ప్రాంతంలో నివాసముండే బాలుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆ తర్వాత నేలకోసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చిన్నారిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె కుటుంబీకులు రక్తపు గాయాలతో పడిఉన్న బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ చిన్నారి మరణించింది. పోలీసులు బాలుడ్ని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జువైనల్ హోంకి తరలించారు.