కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు.ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని కలెక్టర్ పి. రాజా బాబు పేర్కొన్నారు