ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వధువు ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనికి ఆమె బంధువు ఒకరు సహకరించారు. ముగ్గురూ కలిసి బైక్‌పై హడావిడిగా పరారయ్యేందుకు సిద్ధమయ్యారు. కంగారులో బైక్ నడుపుతున్న ప్రేమికుడు ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొన్నాడు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.