కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఏపీకి చెందిన మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. పరిశుభ్రత- పచ్చదనం విభాగంలో తూర్పుగోదావరి జిల్లా బిల్లందూరు, విజయనగరం జిల్లాలోని జోగింపేట, నెల్లూరు జిల్లాలోని కడలూరు గ్రామపంచాయితీలకు అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. జూన్ 5న ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు.