గుజరాత్లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖేడా జిల్లా గోబ్లెజ్ గ్రామంలోని ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదు.