సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక బ్రాడీపేట 2/7లోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సభను చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. లక్ష్మీనారాయణ, వై. నేతాజీ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. నరసింగారావు ముఖ్యవక్తగా పాల్గొంటారని, మతోన్మాదం - కార్మికవర్గంపై ప్రభావం అంశంపై ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కావున సిఐటియు అనుబంధ యూనియన్ల కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.