అసోంలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా పలువరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్పందించారు. ప్రమాద వార్త వినగానే మనసు కలచివేసిందన్నారు. మృతుల తల్లిదండ్రులకు, కుటుంబీకులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా అధికారులతో చర్చించామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చేస్తామని వెల్లడించారు.