రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే స్పందిచారు. దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన కూతుళ్లను ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాదుల తరహాలు దారుణంగా కొట్టారన్నారు. ‘‘రెజ్లర్లు నెల నుంచి తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. కానీ అందుకు బదులుగా వారికి ప్రభుత్వ మౌనం, కర్కశత్వమే లభిస్తున్నాయి. సొంత నేతను కాపాడుకోవడానికి కేంద్రం దేశ కూతుళ్లను హింసిస్తోంది’’అని ఆమె విమర్శించారు.