అపాజీ ఎటాక్ ఎలికాప్టర్ ఒకటి మధ్యప్రదేశ్లో భింద్ జిల్లాలోని పొలాల్లో ల్యాండ్ అయింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ ల్యాండ్ అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి అపాయం జరగలేదని సమాచారం.