మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రూ. 2వేల నోటు ఉపసంహరణపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. చిదంబరం ఆయన అనుభవానికి తగినట్లుగా సూచనలు చేస్తే బావుంటుందని అన్నారు. ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2వేల నోటు రద్దుకు గల కారణాన్ని ఆర్‌బీఐ ఇప్పటికే వివరించిందని మంత్రి తెలిపారు. కాగా, భారతదేశపు నగదు చలామణి పలు అనుమానాలకు దారి తీస్తుందంటూ చిదంబరం వ్యాఖ్యలు చేశారు.
![]() |
![]() |