దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పుంజుకొని 82.68 వద్ద ప్రారంభమైంది. HCL టెక్, ITC, టైటన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.