ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు ఉన్నవారందరికీ జూన్ నుంచి చిరుధాన్యాలు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు పంపిణీ చేయనున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రాగులను పంపిణీ చేయనున్నారు. 3 కేజీల బియ్యం బదులు ఉచితంగా రాగులు తీసుకోవచ్చు. జులై నుంచి రాయలసీమలోని ఇతర జిల్లాల్లో పంపిణీ చేస్తామని వెల్లడించారు.