రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుంజును జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో గుడికి వెళ్లి వస్తుండగా ఓ ట్రాక్టర్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికురల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa