మద్యం మత్తులో కన్నబిడ్డను నేలకేసి కొట్టి చంపాడో కీచక తండ్రి. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. నవులూరు MSS కాలనీకి చెందిన గోపి, మౌనిక దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు గోపి. ఈక్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగివచ్చి మరోసారి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఆర్నెళ్ల చిన్నారి పద్మావతిని చేయి పట్టుకుని ఈడ్చి నేలకేసి కొట్టి చంపేశాడు.