రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 1న రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. జూన్ 1 పత్తికొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ తొలి విడత పెట్టుబడి సాయంగా ఈ డబ్బును అందించనున్నారు. దీనిద్వారా 52.31 లక్షల మందికి రూ.7500 చొప్పున రూ.3.934 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. అలాగే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.46.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించనున్నారు.