అనకాపల్లి: అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే హత్య చేశాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధు వులు, పోలీసుల కథనం ప్రకారం. విశాఖ జీవీఎంసీ పరిధిలో గల కూర్మన్నపాలేనికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (27) అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో సోమవారం మృతిచెందింది. ఇదే గదిలోని మరుగుదొడ్డిలో భర్త మాడే శ్రీనివాసకుమార్ గాయాలతో కనిపించారు. వీరు ఇద్దరూ ఉంటున్న గది నుంచి కేకలు వినిపించడంతో లాడ్జి సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తీయించి చూడగా యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉంది. పోలీసులు రావడంతో గాయాలతో ఉన్న శ్రీనివాసకుమార్ మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. దాంతో తలుపు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన పోలీసులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఉక్కు ఉద్యోగి సాంబ, కల్యాణి దంపతుల ఏకైక కుమార్తె మహాలక్ష్మి చదువుల్లో ముందుం డేది. వ్యవసాయ బీఎస్సీ పూర్తిచేసి రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సచివాలయం పరి ధిలో రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయ కురాలిగా పనిచేస్తోంది. గాజువాక కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఈమెకు సీనియర్ అయిన శ్రీనివాసకుమార్ తో పరిచయమై ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రహస్యంగా రిజిస్ట్రార్ కార్యాల యంలో పెళ్లి చేసుకొంది. సోమవారం ఎలమంచి లిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నిర్వ హించిన సమీక్షా సమావేశానికి ఆమె హాజరైంది. తర్వాత అచ్యుతాపురం వచ్చింది. రోజూ మాట్లాడి నట్లే భోజన సమయంలో తల్లి కళ్యాణితో మాట్లా డింది. తల్లికి చెప్పకుండానే మధ్యాహ్నం 12. 30 గంటల సమయంలో లాడ్జీకి వచ్చింది. శ్రీనివాసకుమార్ ఉదయం 10. 38 నిమిషాలకు రెసిడెన్సీలోని 303 గదిలోకి ఒక్కడే వచ్చిన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కొద్ది సమయం మాట్లాడుకున్న ఇద్దరు తరువాత పెద్ద పెద్ద కేకలు వేసుకున్నారు. వీరు ఉన్న గది నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి తలుపులు తియ్యమన్నా దుస్తులు మార్చుకుంటున్నామని వచ్చేస్తామని చెప్పి సిబ్బందిని ఆయన నమ్మించాడు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తరువాత తలుపులు తీసి మరుగుదొ డ్డిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వ ర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సోమవారం రాత్రి పరిశీలించారు