ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో సహకరించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఎంత ఇచ్చిందనే దానిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. మూడేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని సీఎం జగన్.. విశాఖలో ఏదో సదస్సు పెట్టి హడావిడి చేశారని విమర్శించారు.