కర్నూలు జిల్లా పోలీసు శాఖలో 59 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి. కృష్ణకాంత్ మంగళవారం బదిలీ మంత్రణం నిర్వహించారు. 70 మందికిగాను 68 మంది హాజరయ్యారు. పోలీసుస్టేషన్ల ఖాళీలను ఒక్కొక్కరికి తెరపై చూపి సొంత మండలం మినహాయించి ఏదో ఒక స్టేషన్ ఎంపిక చేసుకునే విధానంలో బదిలీ ప్రక్రియ జరిపారు. 50 మంది పోలీసులు బదిలీ కాగా అనారోగ్యం కారణంగా 9 మంది ప్రస్తుత రాణాల్లో కొనసాగే అవకాశం కల్పించారు. బదిలీ అయిన వారిలో ఒక ఏఎస్సై, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఏవో సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచి సీఐ ప్రసాద్ పాల్గొన్నారు.