పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళవారం కర్నూలు కలెక్టర్ డా. జి. సృజన కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తమ తమ శాఖల పరిధిలోని భవనాల వద్ద పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.