అమృత సరోవర్ పథకం కింద మండలంలోని బలుసుల పాలెం పంచాయతీ పరిధిలో పెట్టు అమ్మిరెడ్డి పాలెం గ్రామంలోని గోరెగుండం చెరువును ఎంపిక చేసినట్లు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మృత సరోవర్ పథకం ద్వారా మూడు లక్షల 91 వేల 829 రూపాయల అంచనాతో ఈ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ ఎడి సాంబశివరావు ఏపీడి ఆర్. భవాని, ఎంపిడిఓ బి. శ్రీనివాసరావు, పంచాయతీ సర్పంచ్ కొనకాల నాగమల్లేశ్వరి సీతారామయ్య, కార్యదర్శి షాహినా సుల్తానా బేగం ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బం పాల్గొన్నారు.