ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఢీకొట్టిన స్కార్పియో వాహనం.. అలాగే 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతులు సీతాపూర్‌కు చెందిన రామ్‌సింగ్, అతని భార్య, వారి పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.