వెదురుకుప్పం మండలంలోని చవటగుంటలో ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో బుధవారం నుంచి మహాభారత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త బండి ఉమాప తిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బుధవారం ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి భాగవతారిణి నాగరత్న హరికథా కాలక్షేపం ఉంటుందన్నారు. గురువారం నుంచి శ్రీ వేంకటేశ్వర నాట్య కళా మండలి మేనేజర్ బొమ్మయ్యపల్లె కిరణ్ ఆధ్వ ర్యంలో రాత్రి వీధి నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
4న ఆదివారం బండి కుంభాలు, 5న సోమవారం అమ్మవారి కల్యాణోత్సవం, అన్న దానం, 6న మంగళవారం ద్రౌపదీ మానసంర క్షణ, 7న బుధవారం అర్జున తపస్సు, 9న శుక్ర వారం ఉత్తరగోగ్రహణం, 10న శనివారం ఇలావంతుని వధ, 11న ఆదివారం దుర్యోధన వధ, ధర్మరాజుల పట్టాభిషేకం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాలకు చి ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపా లతో అలంకరించారు.