కర్ణాటక రాష్ట్రం తముకూరు శివగంగ శృంగేరి మఠం పీఠాధిపతి పురుషోత్తమ భారతి మంగళవారం కాణిపాక వరసి దుడిని దర్శించుకున్నారు. ఆయన్ను ఏఈవో రవీంద్రబాబు ఆలయ మర్యాద లతో ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.