నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేస్తున్నట్లు మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర పేర్కొన్నారు. మదనపల్లి - బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు కు గతంలో పలుమార్లు కేసులు రాసిన బస్సు యాజమాన్యం లో మార్పు రావడం లేదన్నారు. ఇప్పటికి కూడా నిబంధనలు పాటించలేదని కారణంతో బుధవారం ఉదయం మదనపల్లి లో ప్రైవేట్ బస్సు రికార్డులను పరిశీలించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.