దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై మహారాష్ట్ర శివసేన(ఉద్దవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘2024 లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. బీజేపీకి సమయం దగ్గరపడింది. బీజేపీ నియంత పాలనకు ప్రతిపక్షాలు చరమగీతం పాడతాయి’’అని ఆయన చెప్పుకొచ్చారు.