తిరుమల ఘాట్‌రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. తెలంగాణాలోని వనపర్తికి సమీపంలోని ఖిలా ఘన్‌పూర్‌కు చెందిన వెంకట్రామయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు ప్రయాణిస్తున్న వాహనం రెండో మలుపు వద్ద అదుపుతప్పి ఎడమవైపున ఉన్న కొండను ఢీకొంది. ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో ముందు కూర్చుని ఉన్న అన్నదమ్ములు అభిరాం, హరికృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెనుకసీట్లలో ఉన్న వెంకట్రామయ్య, ఆయన సతీమణి ప్రమీల తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ముందున్న మలుపును గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.