రష్యాపై జరిగిన డ్రోన్ దాడులను నిర్లక్ష్యం చేయడం ద్వారా అమెరికా.. ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తోందని అమెరికాకు రష్యా రాయబారి అంటొనోవ్ పేర్కొన్నారు. ‘‘రష్యాపై జరిగిన దాడికి తాము మద్దతు తెలపలేదంటూనే అమెరికా ఇప్పటికీ ఆ దాడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తుంది. ఇది ఉక్రెయిన్ ఉగ్రవాదులను ప్రోత్సహించడమే’’ అని ఆయన అన్నారు.