రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. గుంటూరు పట్టణంలోని నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలు దాచిపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. అలాంటి వ్యక్తి చెప్పే మాటలు ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తా ఉన్నారని మండిపడ్డారు.