అలవాల గ్రామంలో ఎస్సీ కాలనీలో గాలి వానతో గృహం ధ్వంసమై రోడ్డున పడిన బాధిత కుటుంబంతో కలిసి బుధవారం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు ఆటోలో ఆర్టీవో ఆఫీసుకువెళ్లారు. గాలివాన విధ్వంసంతో పేద కుటుంబం వసతిని కోల్పోయారని, ప్రభుత్వం బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని చదలవాడ డిమాండ్ చేశారు. అనంతరం నరసరావుపేట ఆర్డీవోను కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.