గుంటూరు జిల్లా పరిషత్ కార్యలయంలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి ద్వారా లివర్ మార్పిడి కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా జరిగిన లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు.