బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, జన రంజకమైన మేనిఫెస్టోను విడుదల చేసిన మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయానికి, చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు, కార్యదర్శిలైన తన్నీరు పుల్లారావు, మోతుకూరి శివరామ్ ఆధ్వర్యంలో, బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేయటం స్వాగతించదగ్గ విషయం తెలిపారు.
ఈ సందర్భంగా, రాష్ట్ర తెలుగు యవత కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిబోయిన శివ, రాష్ట్ర టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాస రావు(R. T. C), చిలకలూరిపేట నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి జంజనం వెంకటేశ్వరరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు నిమ్మకాయల ప్రసాద్, టౌన్ మహిళ అధ్యక్షురాలు అద్దంకి అనిత భాయి, చిలకలూరిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మిద్దెల వనితా బాయ్, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు, కార్యదర్శిలైన తన్నీరు పుల్లారావు, మోతుకూరి శివరామ్ లు ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రములో అత్యధిక జనాభా గలిగిన బిసి సామజిక వర్గ ప్రజలకు న్యాయం చేసేది, వారి అభివృద్ధికి కృషి చేసే పార్టీ టీడీపీనే అని, బీసీల అభ్యున్నతి చంద్రబాబు పాలనతోనే సాధ్యమని టీడీపీ బిసి నాయకులు తెలిపారు.
రాష్ట్రంలోనే బీసీల అభివృద్ధి అభ్యున్నతి పాటుపడిన ఏకైక పాలన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మరలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. చంద్రబాబు హామీలతో పేద ప్రజలకు అభివృద్ధిపై ఆశలు చిగురించాయని, వాటిని ఓర్వలేక వైసిపి నేతలు ప్రజలను ఏమార్చడానికి నోరు పారేసుకుంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సహోదరుల తదితరులు పాల్గొన్నారు.