బుధవారం ఉదయం శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో గల కొత్త రోడ్డు దగ్గర స్వర్గీయ శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవ మరియు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాజగోపాల రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారా యణ, మాజీ విప్ కూన రవికుమార్, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.