తెనాలి పట్టణంలోని చెంచుపేట ఓవర్ డౌన్ పద్మావతి కళ్యాణ మండపం రోడ్డు సమీపంలో దారుణ హత్య హత్య. తెనాలి పాండురంగపేటకు చెందిన రౌడీ షీటర్ మత్తే ప్రశాంత్ (30) దారుణ హత్యకు గురయ్యాడు. గతంలోతెనాలి త్రీటౌన్ పరిధిలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ కొంతకాలంగా గుంటూరులో ఉంటూ బుధవారం తెనాలి వచ్చాడు. గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులతో వచ్చి ప్రశాంత్ వెంటపడి కత్తులతో నరికి చంపారు.