అధిక లోడుతో వెళ్తున్న లారీకి అధికారులు జరిమానా విధించారు. కొల్లిపర మండలం అత్తోట వద్ద బుధవారం అధిక ఇసుక లోడుతో వెళుతున్న లారీలను ఎస్ఈబీ తెనాలి ఇన్స్పెక్టర్ ఏవీ చలం, సిబ్బంది గుర్తించారు. లారీ యజమానికి రూ. 16 వేల జరిమానా విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అధిక లోడ్ తో ప్రయాణిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.