పోలీసుశాఖలో ఐదేళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను బదిలీ చేసేందుకు బుధవారం చిత్తూరు ఎస్పీ కార్యాలయం నందు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి అధికారి వరకు ఏఎస్పీ సుధాకర్ సమక్షంలో కౌన్సెలింగ్ జరిపారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న 13 మంది ఏఎస్ఐలు, ఏడుగురు హెడాకానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేశారు. ఆయా సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఆప్షన్ లో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు. బదిలీ అయిన వారంతా వారికి కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేసుకుని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, డీపీవో క్లర్క్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.