రెండ్రోజుల క్రితం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో. ఎండలూ తగ్గినట్లేనని భావించిన ప్రజలు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా. మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బుధవారం అత్యధికంగా చిత్తూరులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. శ్రీరంగరాజపురంలో 40.4, వెదురుకుప్పంలో 40.2, విజయపురంలో 40.1, గుడిపాలలో 39.8, నగరిలో 39.8, కార్వేటినగరంలో 39.7, పాలసముద్రంలో 39.3, నిండ్ర 39.1 బంగారుపాళ్యంలో 38. 8, గంగాధరనెల్లూ రులో 38. 6, యాదమరిలో 33.3, పూతలపట్టులో 382, తవణంపల్లెలో 37.9, పెద్దపంజాణిలో 37.7, గంగవరంలో 37.7, ఐరాలలో 37. 6, చౌడేపల్లెలో 37. 4, పుంగనూరులో 37. 2 6. 9, పలమనేరులో 36. 7, పెనుమూరులో 36.7, రొంపిచెర్లలో 36. 3, గుడుపల్లెలో 35.9, కుప్పంలో 35.9, బైరెడ్డిపల్లెలో 35.3, వి. కోటలో 35.1, పులిచెర్లలో 35, సోమలలో 34.5, శాంతిపురంలో 33.9, రామకుప్పంలో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.