ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్,,,ప్రపంచస్థాయి ఆర్ధికవేత్తలు, నాయకులు హాజరు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 07:29 PM

టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2023‌ (ఐఈసీ)కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గత తొమ్మిదేళ్లుగా టైమ్స్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది ‘ఇండియా: ది ఎమర్జింగ్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ వేదిక జరుగుతోన్న కాన్‌క్లేవ్‌లో టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ ప్రారంభోపన్యాశం చేశారు. ఈ సందర్భంగా ఆయన . భారతదేశ జీడీపీ వృద్ధి రేటుపై ప్రశంసలు కురిపించారు. స్థూల దేశీయోత్పత్తి అన్ని అంచనాలను అధిగమించి 7.2 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.


‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బలమైన, సాహసోపేతమైన ప్రభుత్వం కారణంగా భారతదేశం ఈ వృద్ధి సాధించింది.. ఇప్పుడు చాలా వాస్తవమైంది.. ఇది భారతీయ పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని విధంగా అపారమైన అవకాశాలను సృష్టించింది.. వీరిలో చాలా మంది యువకులు ఉన్నారు. . మా కాన్‌క్లేవ్ దేశం ఆర్థిక ఎజెండాను విజయవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని జైన్ స్పష్టం చేశారు. ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2023లో భారత అగ్రశ్రేణి నేతలు, ప్రపంచ ఆర్ధికవేత్తలు తమ వ్యూహాత్మక ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోనున్నారు.


ఈ సందర్భంగా ప్రపంచ వేదికపై భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీ నాయకత్వంపై టైమ్స్ గ్రూప్ ఎండీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఒక దేశ అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించడం తరచుగా జరగదు.. అదృష్టవశాత్తూ వైవిధ్య జనాభా కలిగిన భారతదేశంలో భారతీయులకు విస్తృతమైన శ్రేయస్సును తీసుకువస్తానని వాగ్దానం చేసే అమృత్ కాల్‌కు మేం సాక్ష్యమిస్తున్నాం’ అని జైన్ పేర్కొన్నారు. ‘దేశంలో స్థిరత్వం.. ప్రపంచాన్ని గౌరవించేలా చేసింది.. మనం పొందేందుకు ప్రతిదీ ఉంది’ అని ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ఐఈసీ 2023 ప్రధాన లక్ష్యాన్ని వినీత్ జైన్ నొక్కి చెప్పారు. ప్రపంచంలోని మూడో ఆర్ధిక శక్తిగా ఎదగడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. ‘ప్రపంచ ప్రతికూలతల మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది.. భౌగోళిక రాజకీయ, జీ20 అధ్యక్ష మద్దతుతో భారతదేశానికి ఏమి జరుగుతుందో ఐఈసీ అన్వేషిస్తుంది. వేగవంతమైన ఆర్ధిక విస్తరణ ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకునేలా కార్యాచరణను కూడా రూపొందిస్తుంది.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశం ఆర్థిక ఎజెండాను చాంపియన్‌గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.. రోడ్‌మ్యాప్‌ను చర్చించడానికి మేధావులు, విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రభావశీల నాయకులు ఇక్కడ ఉన్నారు.. భారత ఆకాంక్షలను చర్యలుగా మార్చడానికి ఎటువంటి మిషన్ అవసరమో నిర్ణయిస్తారు’ అని టైమ్స్ గ్రూప్ ఎండీ అన్నారు.


ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని, మార్గనిర్దేశం చేసే ఆలోచనలను పంచుకోవడానికి ఆహ్వానాన్ని మన్నించి హాజరవుతోన్న కేంద్ర మంత్రులకు జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజున కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొంటారు.


భారత్ సంస్కరణవాద, బలమైన ప్రభుత్వాన్ని కలిగి ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ వైద్యనాథన్ అన్నారు. ‘ఈ రోజు ఉన్నది వ్యవస్థాపక ప్రభుత్వం, పనులను ఎలా చేయాలో దీనికి తెలుసు’ అని వైద్యనాథన్ అన్నారు. భారత డిజిటల్ పరివర్తనను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ‘డిజిటలైజ్డ్ దేశంగా మారే దిశలో ముందుకు సాగడం భారతదేశానికి చాలా గర్వకారణం.. ఈ రోజూ మన చుట్టూ చూస్తున్నాం... రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారాలు కూడా చెల్లింపుల కోసం యూపీఐ (UPI) మోడ్‌ను ఉపయోగిస్తున్నాయి.. ఇది ఒక భారీ విజయం’ అన్నారాయన.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa