ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓడిపోవడం ఖాయం: బుద్దా వెంకన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 07:30 PM

వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని  రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో ఉన్న ఊర కుక్కలకే తాను సమాధానం చెప్పానని.. ఇక్కడ బురద పందులకు సమాధానం చెప్పలేనా అని అన్నారు. ‘‘అరిసే కుక్కలు కరవవు.. మా కృష్ణా జిల్లాలోనే కుక్కలు ఉన్నాయని అనుకున్నాను. అక్కడి ఊర కుక్కలకే సమాధానం చెప్పాను. బురద పందులకు సమాధానం చెప్పలేనా? స్పీకర్ తమ్మినేని సీతారాం.. మా స్కూల్ నుంచి (తెలుగు దేశం పార్టీ) వచ్చిన వ్యక్తే. ప్రజల సొమ్ము తిని పందిలా బలిశారు. చచ్చే వరకూ టీడీపీలో ఉంటానని సీతారాం అన్నారు. ఇప్పుడ బురద పందిలా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో తమ్మినేని గెలిచారు. 2024 ఎన్నికలో ఆయన ఓటమి ఖాయం.


టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జిగా చెబుతున్నా.. 2024లో ఆముదాలవలసలో కూన రవికుమార్ గెలవబోతున్నారు. ఒకవేళ ఆయన ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతారు. మీరు ఓడిపోతే మీ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటారా? 2024 ఎన్నికల్లో ఆముదాలవలస రోడ్డుపై అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా తమ్మినేని రోడ్డు మీద ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో తమ్మినేనిపై కోన రవి కుమార్ పోటీ చేసి గెలుస్తారు. తమ్మినేని పందిలాగా బలిసి చంద్రబాబు పినిష్ చేస్తానని అంటావా? బుద్ధి ఉందా?’’ అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. విశాఖపట్నంలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి.. కబ్జా చేశారని ఆరోపించారు. అక్కడ ఎవరూ కొనుక్కొని మోసపోవద్దని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బుద్ధా వెంకన్న అన్నారు.


ఇక, న్యాయ వ్యవస్థను ఎవరూ మేనేజ్ చేయలేరని బుద్ధా వెంకన్న అన్నారు. తల్లి వంకతో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో వ్యవస్థల్ని వైసీపీ వాళ్లు మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతున్నారని చెప్పారు.


రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. వెనకస్తుకి వెళ్లినా తెలుగు దేశం పార్టీనే గెలుస్తుందని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. ఇడుపాయ ఎస్టేట్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 2 వేల నోట్ల కట్టలు దాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ రూ. 2 వేల నోట్లను ఎలా మార్చాలనే పనిలో జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిది పక్కా క్రిమినల్ మైండ్ అని.. ప్రస్తుతం ఆయన డిప్రిషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాల దగ్గరకు సీఎం జగన్ డేరాలు కట్టుకొని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు ఏపీ డేరా బాబుగా మారారని సెటైర్లు వేశఆరు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు. కాని పక్షంలో చంద్రబాబు ఎక్కడి నుంచి చంద్రబాబు పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాననని స్పష్టం చేశారు. ఇక, టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై తాను స్పందించబోనని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa