గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పేరం సాంబశివరావు గురువారం హఠాత్ మరణం చెందారు. విషయం తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేరం సాంబశివరావు గృహానికి వెళ్లి ఆయన పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే రోశయ్య వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.